వసతిగృహాల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి

వసతిగృహాల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి

హాస్టల్‌ పరిసరాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ వినోద్‌కుమార్‌

ప్రజాశక్తి-తాడిపత్రి రూరల్‌

వసతిగృహాల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ గురువారం తాడిపత్రిలో పర్యటించారు. ముందుగా కార్యాలయాన్ని పరిశీలించారు. వివిధ భాగాలు, రికార్డు రూమ్‌ను తనిఖీ చేశారు. అనంతరం నందలపాడు వద్ద ఉన్న సాంఘిక సంక్షేమ సమీకృత బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ సమీకృత బాలుర వసతి గృహంలో అవసరమైన మరమ్మతులను త్వరితగతిన చేపట్టాలన్నారు. ముఖ్యంగా వసతి గృహంలో మరుగుదొడ్లు, పైకప్పు పనుల మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ జేడీ మధుసూదన్‌రావు, ఏఎస్‌డబ్ల్యుఓ ఫక్కీరయ్య, తహశీల్దార్‌ ఆంజనేయులు, సిఎస్‌డిటి రాజారామ్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️