యామినీబాల

Apr 7,2024 08:14 #యామినీబాల

వైసీపీకి శింగనమల మాజీ ఎమ్మెల్యే యామినీబాల రాజీనామా

         నార్పల : అనంతపురం జిల్లా శింగనమల మాజీ ఎమ్మెల్యే వైసిపికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె శనివారం నాడు అనంతపురం నుంచి ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ఇందులో ఆమె వైసిపిపై పలు విమర్శలు చేశారు. వైసిపిలో దళితులు, బిసిలకు గుర్తింపు లేదన్నారు. అగ్రవర్ణాల పెత్తనం కొనసాగుతోందని తెలియజేశారు. ఇలాంటి పార్టీలో కొనసాగడం ఇష్టం లేక రాజీనామా చేస్తున్నట్లు తెలియజేశారు. వైసిపి శింగనమల టికెట్‌ వ్యవహారంపై గత నెల రోజులుగా తీవ్ర అసమ్మతి నెలకొంది. వీరాంజినేయులకు టికెట్‌ ఇవ్వడాన్ని వైసిపి అసమ్మతి నేతలు నిరసిస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయినా అభ్యర్థిని మార్చకపోవడంతో అసమ్మతి నేతలు ఇప్పటికే రాజీనామా చేస్తామని ప్రకటించారు. తాజాగా యామినీబాల ఆపార్టీకి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. యామినీబాల 2014 ఎన్నికల్లో టిడిపి తరుపున ఎమ్మెల్యేగా గెలిచింది. 2019 ఎన్నికల్లో టికెట్‌ దక్కకపోవడంతో ఆమె పోటీ చేయలేదు. వైసిపి అధికారం వచ్చిన తర్వాత ఆమె తన తల్లి మాజీ ఎమ్మెల్సీ శమంతకమణితో కలిసి వైసిపిలో చేరారు.

➡️