అంగన్వాడీలు ఎస్మా జీవో 2 కాపీల దగ్ధం

Jan 7,2024 14:37 #Anganwadi strike, #East Godavari

ప్రజాశక్తి – ఉండ్రాజవరం(తూర్పుగోదావరి): తమ న్యాయపరమైన కోర్కెల సాధన కు అంగన్వాడీలు నిర్వహిస్తున్న సమ్మె ఆదివారం 27 వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా శనివారం అంగన్వాడీలను అణిచివేసేందుకు ప్రభుత్వం ఎస్మా అస్త్రాన్ని ప్రయోగించింది. దానికి వ్యతిరేకంగా ఉండ్రాజవరం మండల అంగన్వాడీలు, తహసీల్దార్ కార్యాలయం వద్ద సమ్మె నిర్వహిస్తున్న శిబిరం నుండి, జీవో 2 రద్దు చేయాలని నినాదాలతో అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అనంతరం పెరవలి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ గౌరవ అధ్యక్షులు జువ్వల రాంబాబు ఆధ్వర్యంలో అంగన్వాడీలు జీవో 2 ప్రతులను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ రంగనాయకమ్మ, ఎం జానకి. పి వి ఎస్ ఎస్ లక్ష్మి, విజయ కుమారి, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

➡️