కర్రసాములో ‘ఏకలవ్య’ క్రీడాకారుల ప్రతిభ

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ ఈ నెల 24, 25, 26వ తేదీలలో కన్యాకుమారిలో జరిగిన జాతీయ స్థాయి కర్రసాము ఛాంపియన్‌షిప్‌లో ప్రతిభ చాటి పథకాలు సాధించారని మాస్టర్లు రెడ్డి ప్రవీణ్‌, ఉద్దండపు బాలాజీ గణేష్‌ తెలిపారు. కర్ర సాము ఛాంపియన్‌షిప్‌లో తమ క్రీడాకారులు సురుల్‌ వాల్‌ విభాగంలో టి.శివకుమార్‌ రజత పతకం, వై.గంగాధర్‌, టి.రేవంత్‌రెడ్డి కాంస్య పథకాలు, ఈటె విభాగంలో కె.ఎల్‌.భరణి కుమార్‌ కాంస్య పతకం, కతికరెడ్డి రజత పతకం సాధించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించినప్పుడే సర్వతో ముఖాభివద్ధి చెందుతారని, తమ అకాడమీ ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణించడం గర్వకారణమని పేర్కొన్నారు.- పతకాలు సాధించిన క్రీడాకారులతో మాస్టర్లు

➡️