ప్రశాంత వాతావరణంలో 10 పరీక్షలు 

Mar 18,2024 11:12 #Annamayya district

ప్రజాశక్తి-కలకడ: మండలంలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో మొదలైనట్లు కస్టోడియన్ మునీంద్ర నాయక్ తెలిపారు. మండలంలో 10వ తరగతి పరీక్షలు కలకడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆదర్శ పాఠశాల, కోన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్షలను ప్రకడ్బందీగా అన్ని సౌకర్యాలు కల్పించి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కలకడ పరీక్ష కేంద్రం నందు 207 మంది విద్యార్థులు పరీక్షలు రాయవలసి ఉండగా పరీక్షలకు మొత్తం విద్యార్థులు హాజరైనట్లు సిఎస్ వెంకటరమణ తెలిపారు. ఆదర్శ పాఠశాల నందు 219 మంది విద్యార్థులు పరీక్షలు రాయవలసి ఉండగా వారిలో రెగ్యులర్ ఇద్దరూ, కంపార్ట్మెంటల్ ఐదుగురు గైర్హాజరై 212 మంది విద్యార్థుల పరీక్షలు రాస్తున్నట్లు సిఎస్ రామానుజులు తెలిపారు. అదే విధంగా కోన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మొత్తం వందమంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావలసి ఉండగా వారిలో రెగ్యులర్ ఇద్దరు కంపార్ట్మెంటల్ ఏడు మంది గైర్హాజరై 91 మంది పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రానికి విద్యార్థులు హడావుడిగా పరుగులు తీసి కేంద్రానికి చేరుకున్నారు. అదేపరీక్షల నిర్వహణలో డివోలుగా ఖాదర్ భాష నాగ ముని నాయక్ శంకర్ నాయక్ లు వ్యవహరిస్తున్నట్లు తెలిపారు.

➡️