పొర్లుదండాలతో అంగన్వాడీల నిరసన

Jan 1,2024 15:24 #Annamayya district
anganwadi workers strike 21 day annamayya

 

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : 21వ రోజు సమ్మెలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఐసిడిఎస్ కార్యాలయం వద్ద పొర్లు దండాలతో నిరసన తెలిపారు. ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో సైతం కుటుంబాలను వదిలి మహిళలు రోడ్డులెక్కుతున్నారంటే ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి పుణ్యమేనని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు ఈశ్వరమ్మ, విజయ, శివరంజని, అమరావతి, సరోజిని, విజయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

➡️