భక్తిశ్రద్ధలతో రంజాన్ పర్వదిన వేడుకలు 

Apr 11,2024 09:14 #Annamayya district

 ప్రార్థనల్లో పాల్గొన్న వేలాది మంది ముస్లిం సోదరులు

ప్రజాశక్తి – బి.కొత్తకోట : పవిత్ర రంజాన్ పర్వదినాన్ని తంబళ్లపల్లి నియోజకవర్గం, బి.కొత్తకోట మండలంలో ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా గురువారం బి.కొత్తకోట పట్టణం, పిటియం రోడ్డులోని ఈద్గా వద్దకు అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఒకరికొకరు ఆలింగం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ముస్లిం పెద్దలు మాట్లాడుతూ ప్రేమ,సోదర భావం,శాంతికి చిహ్నమే రంజాన్పర్వదినమన్నారు. ప్రతి ఏడాది హిందూ, ముస్లిం సోదరులు కలిసి ఇక్కడ రంజాన్ పర్వదినాన్ని జరుపుకొని మతసామరస్యాన్ని చాటుకోవడం స్ఫూర్తిదాయకమన్నారు. 30 రోజులపాటు కఠోర ఉపవాస దీక్షలు ఉండి అల్లా అనుగ్రహం పొందుతారని తెలిపారు. ఆ అల్లా చల్లని దీవెనలతో చక్కగా వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండి ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఇక ఎస్.ఐ.రామ్మోహన్ ఆధ్వర్యంలో ముస్లింల మత ప్రార్థనలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.ముస్లిం సోదరులు వారి కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన, ఆధ్యాత్మిక వాతావరణంలో రంజాన్వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ ఫయాజ్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ అయుబ్ భాష, డాక్టర్ అరిఫ్,అహ్మద్ భాష, హైదర్, సాదిక్, సద్దాం, ఖాదర్ బాషా, మున్షిద్, ముబీద్, మియా, జాఫర్ బై, స్వాతి జిరాక్స్ సెంటర్ చాంద్ బాషా, కో-ఆప్షన్ మెంబర్ నాసర్, సిపిఐ సలీం, సిపిఐ బషీర్, తదితరులు పాల్గొన్నారు.

➡️