కలకడలో గడపగడపకు…

Apr 6,2024 12:17 #Annamayya district

ప్రజాశక్తి-కలకడ: రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని మాజీ జడ్పిటిసి శివానందరెడ్డి పేర్కొన్నారు.మండలంలోని బాటవారిపల్లి పంచాయతీలోని ఆంజనేయ వడ్డీపల్లి మరియు పోతువారిపల్లి నందు మాజీ జడ్పిటిసి సభ్యులు శివానంద రెడ్డి గడపగడపకు వెళ్లి జగన్ మోహన్ రెడ్డి మరొక అవకాశం ఇవ్వాలని రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి పీవీ మిథున్ రెడ్డి, మరియు పీలేరు నియోజవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డిలను ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, గెలిస్తేనే రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుందని, ప్రతి సామాజిక వర్గానికి న్యాయం చేకూరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీదేవి రవికుమార్ ,పార్టీ కన్వీనర్ కమలాకర్ రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు వెంకటరమణారెడ్డి, వైసీపీ నాయకులు రవికుమార్, కుమార్ రెడ్డి, అంజన్ కుమార్, మల్లికార్జున, చిన్నప్ప నాయుడు, గోపాల్, ఉదయభాస్కర్, మాతంగా తదితరులు పాల్గొన్నారు.

➡️