ఆటో ఢీకొని వృద్ధుడు మృతి 

Apr 7,2024 11:27 #Annamayya district

ప్రజాశక్తి-కలకడ: ఆటో ఢీకొని వృద్ధుడు మృతి చెందిన సంఘటన మండలంలో ఆదివారం వేకువజామున జరిగింది. మండలంలోని బాటవారిపల్లి పంచాయతీ కె.మాదిగ పల్లికు చెందిన కలకడ పాపయ్య కుమారుడు కలకడ లక్ష్మయ్య(74) శనివారం రాత్రి స్థానిక బాలయ్య గారి పల్లి పంచాయతీ దేవలంపేట వెలిసిన శ్రీ కామాక్షి సమేత సిద్దేశ్వర స్వామి ప్రాంగణంలో జరుగుతున్న మహాభారత యజ్ఞానికి వెళ్లినట్టు తెలిపారు. మహాభారత యజ్ఞం చూసుకొని తిరిగి వస్తున్న సమయంలో మండల కేంద్రమైన కలకడ పోలీస్ యు కాంప్లెక్స్ ఎదురుగా చిత్తూరు- కర్నూలు జాతీయ రహదారిపై నడిచి వెళుతున్న లక్ష్మయ్యను, చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలం రొంపిచర్ల చెందిన రమేష్ తన ఏపీ 03 టి ఈ7697 ఆటోను అజాగ్రత్తగా, అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ రోడ్డుపై నడిచి వెళుతున్న లక్ష్మయ్యను ఢీకొన్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో లక్ష్మయ్యకు బలమైన రక్త గాయాలు కావడంతో ముక్కు నుండి రక్తం కారి ప్రమాద స్థలములోనే మృతి చెందినట్లు తెలిపారు. ప్రమాద విషయం తెలుసుకున్న తన కుమారుడు కలకడ రమేష్ మరియు కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకొని లక్ష్మయ్య మృతి చెందిన గుర్తించి బోరున విలపించినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో లక్ష్మయ్య మృతి చెందడంతో కే మాదిగ పల్లెలో విషాదశాలు అనుముకున్నట్టు తెలిపారు.రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన ఆస్థానానికి చేరుకుని మృతి చెందిన లక్ష్మయ్య పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం పీలేరు తరలించినట్టు పోలీసులు తెలిపారు. మృతుడి కుమారుడు కలకడ రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణారెడ్డి తెలిపారు.

➡️