అవినీతి పాలనకు అంతిమ గడియలు

Apr 6,2024 12:11 #Annamayya district

నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి
ప్రజాశక్తి-కలకడ: అవినీతి పాలనకు అంతిమ ఘడియలు దగ్గర పడ్డాయని పీలేరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెలిపారు. మండలంలోని బాలయ్య గారి పల్లి పంచాయతీ ఎర్రయ్య గారి పల్లి తదితర ప్రాంతాలలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి కొద్దిరోజుల్లో ఉన్నాయని తెలియజేశారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలు, అవినీతిపనులు, దుర్మార్గపుచర్యలు, ప్రజలు చూస్తున్నారని వాటిని తిప్పి కొట్టడానికి ప్రజలు ఎదురుచూస్తున్నట్లు విమర్శించారు. బస్సు యాత్రలు, సమావేశాలకు ఆర్టీసీ బస్సులను వాడుకోవడం ప్రజలకు, ప్రయాణికులకు పలు రకాలుగా ఇబ్బందులు పెట్టడం గమనించి వచ్చేఎన్నికలలో జగన్ను ఇంటిదారి పట్టించడం ఖాయమని జోష్యం పలికారు. నిత్యవసర వస్తువుల సరుకుల ధరలు పెంచి ప్రజలను మభ్యపెట్టి అమ్మఒడి, అభయస్థం, వంటి పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను మోసం చేస్తున్న ప్రజల గమనించి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు మద్దిపట్ల సూర్య ప్రకాష్ నాయుడు, మల్లారపు రవి ప్రకాష్ నాయుడు, మాజీ జడ్పిటిసి తిరుపతి నాయుడు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు మద్దిపట్ల వెంకటరమణ నాయుడు, దగ్గుపాటి వెంకటేశ్వరరావు, సర్పంచులు విశ్వనాథ నాయుడు, వెంకటరమణ, మాజీ సర్పంచ్ త్యాగరాజు, శ్రీనివాసులు రెడ్డి ,దామోదర్ నాయుడు, వెంకటరమనాయుడు, పివి నాయుడు, ఈశ్వరయ్య, కోటేశ్వర్, రైస్ మిల్ వెంకటరమణ, (పెద్దోడు ),వై జిలాని భాష, షబ్బీర్ అహ్మద్, ఈనయా తుల్లా ఖాన్, జిరాక్స్ అల్లి, ఖాజా తదితరులు పాల్గొన్నారు.

➡️