రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి : సీఐటీయూ

Jan 26,2024 15:45 #Annamayya district
uecwu mahasabha poster

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : ఈ నెల 28వ తేదీన నెల్లూరులోని జెట్టి శేషారెడ్డి భవన్ లో జరిగే యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రెండవ రాష్ట్ర మహాసభలకు విద్యుత్తు కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రవికుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద విద్యుత్ ఉద్యోగులు, కార్మికులతో కలిసి ఆయన రాష్ట్ర మహా సభల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల మేరకుకాంట్రాక్టు కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, వాచ్ మెన్లుగా పనిచేస్తూ షిఫ్ట్ ఆపరేటర్లుగా చేరిన మరియు నూతన ఆపరేటర్లకు పాత ఆపరేటర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలని, తెలంగాణ తరహాలో డైరెక్ట్ పేమెంట్ చెల్లించాలని, 2022 పిఆర్ సి ప్రకారం కనీస వేతనం బేసిక్ వేతనంగా చెల్లించాలని., మీటర్ రీడర్లకు, బిల్ కలెక్షన్ ఏజెంట్లకు, ఎస్ పి ఎం కార్మికులకు, స్టోర్ హమాలీలకు కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రిసిటీ వర్కర్స్ యూనియన్ నాయకులు శ్రీహరి, ఎరికల్ రెడ్డి, సుధాకర్, బాలాజీ, మణి తదితరులు పాల్గొన్నారు.

➡️