తిప్పలు తప్పేనా?

May 17,2024 21:06

ప్రజాశక్తి – సీతంపేట :  స్థానిక గిరిజన బాలుర గురుకుల పాఠశాల సమస్యల వలయంలో చికొట్టుమిట్టాడుతోంది. కనీస మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అరకొర సౌకర్యాల మధ్య ఈ ఏడాది అవస్థలు తప్పవానని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాల దుస్థితిపై ఇప్పటికే అధికారులకు ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు వినతులు సమర్పించినా ప్రయోజనం శూన్యంస్థానిక ఐటిడిఎకు కూతవేటు దూరంలో ఉన్న గిరిజన బాలుర గురుకుల పాఠశాలను 1985లో ప్రారంభించారు. ఇప్పటికీ సుమారు నాలుగు దశాబ్దాలు కావస్తుండడంతో భవనాలు శిథిలావస్థకు చేరుకున్నా అందులోనే ఉపాధ్యాయులు విద్యాబోధన నిర్వహిస్తున్నారు. వర్షాకాలంలో పాఠశాల కారితూ, పెచ్చులు ఊడినప్పటికీ 6 నుండి 10వ తరగతి వరకు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. డైనింగ్‌ హాలు లేక విద్యార్థులు వరండాలోని భోజనం చేయాల్సి పరిస్థితి నెలకొంది. ఇప్పటికే మూడు గదుల వరకు వర్షాకాలంలో పాఠశాల కారుతుంది. ఇక శ్లాబ్‌ పెచ్చులు ఎప్పుడు తమపై పడతాయోనని విద్యార్థులు, ఉపాధ్యాయులు బిక్కుబిక్కుమంటున్నారు. ఈ పాఠశాలలో సుమారు 430మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యకు తగ్గ వసతుల్లేకపోవడంతో వారు అవస్థలు పడుతున్నారు. 2021లో పాఠశాలకు నాబార్డ్‌ నిధులు రూ.2 కోట్లు మంజూరైనప్పటికీ ఒక కాంట్రాక్టు టెండర్‌ ద్వారా పనులు దక్కించుకున్నారు కానీ పనులు ప్రారంభించలేదు. ఉపాధ్యాయ క్వార్టర్స్‌ శిథిలావస్థకు చేరుకోవడంతో నివాసముండేందుకు వారు తీవ్ర అవస్థలుపడుతున్నారు. ఇక పాఠశాలకు ప్రహరీ గోడ లేదు. రాళ్లు తేలిన రహదారిపై విద్యార్థులు నడవవలసిన పరిస్థితి నెలకొంది. గురుకుల కళాశాల అదే పరిస్థితిస్థానిక గురుకుల బాలుర కళాశాలలో వివిధ గ్రూపులకు చెందిన 340 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అయితే వారు కాలేజీకి వచ్చేందుకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రహరీ గోడ లేకపోవడంతో రాత్రి వేళలో విషపూరిత జంతువులు ప్రవేశిస్తున్నాయని విద్యార్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సౌకర్యాలు కల్పిస్తే మరింత మెరుగైన ఫలితాలుపాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తే మెరుగైన ఫలితాలు సాధిస్తాం. ఈ ఏడాది పదో తరగతిలో విద్యార్థులు 76 మందికి 76 మంది ఫస్ట్‌ క్లాస్‌లో పాస్‌ అయ్యారు. 2023లో 77 మందికి 76 ఉత్తీర్ణులయ్యారు.

2022లో శతశాతం సాధించారు.

ఇలా మా పాఠశాలలో విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించారు. వారికి, ఉపాధ్యాయులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తే మరింత నాణ్యమైన, మెరుగైన విద్య అందించేందుకు అవకాశం ఉంటుంది.ఎస్‌ తిరుపతిరాజు, ప్రిన్సిపల్‌కాంట్రాక్టర్‌కు నోటీసులు పంపాం గురుకుల పాఠశాలకు అభివృద్దికి నాబార్డ్‌ నిధులు రూ. రెండు కోట్లు మంజూరయ్యాయి. కాంట్రాక్టు టెండర్‌ ద్వారా దక్కించుకున్నప్పటికీ పనులు ప్రారంభిం చలేదు. దీంతో నోటీసులు పంపించాం.

– ఎస్‌.సింహాచలం, ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఎడ్యుకేటివ్‌ ఇంజనీర్‌.

➡️