అంగన్వాడిల సమస్యను నువ్వేనా ఆలకించంటూ.. ఎద్దుకు వినతిపత్రం

Dec 28,2023 14:43 #Anganwadi strike, #Kadapa

ప్రజాశక్తి – వేంపల్లె(కడప) : రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి అంగన్వాడీల సమస్యలు పట్టలేదని నువ్వేనా మా సమస్యలు ఆలకించంటూ ఎద్దుకు రీతిలో వినతిపత్రం అందజేసి అంగన్వాడీలు విన్నూతంగా నిరసన తెలిపారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలంటూ చేస్తున్న సమ్మె గురువారం నాటికి 17వ రోజుకి చేరుకొంది. దీంతో అంగన్వాడీ మహిళాలు విన్నూతంగా ఎద్దుకు వినతిపత్రం అందజేసి ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డికి జ్ణానోదయం కలిగించాలని కోరారు. జీతాలు పెంచాలని సమ్మె చేస్తున్న ముఖ్యమంత్రి తనకు ఏమి కనపడలేదని, వినపడలేదని మౌనంగా కూర్చోవడం బాధకరమని అంగన్వాడీ సంఘాల నాయకులు సరస్వతి,, శైలజా, సావిత్రిలు చెప్పారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడంలో సిఎం జగన్‌ రెడ్డి మొండి వైఖరి ప్రదర్శించడం దుర్మార్గం అన్నారు. అంగన్వాడీలకు ఇచ్చిన హమీలను అమలు చేయాలని మాత్రమే కోరుతున్నట్లు తెలిపారు. అంగన్వాడీల గ్రాడ్యూటితో పాటు నెలకు 26 వేలు జీతం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సిఎం జగన్‌ ప్రదర్శిస్తున్న మొండీ వైఖరి విడనాడాలని కోరారు. ఈ సమ్మె కార్యక్రమంలో వేంపల్లె, చక్రాయపేట, వేముల అంగన్వాడీల మహిళాలు పాల్గొన్నారు.

➡️