మాచర్ల అభివృద్ధికి సాయం అందించండి

Jul 2,2024 23:40

సిఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి
ప్రజాశక్తి – మాచర్ల :
మాచర్ల నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన సాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి కోరారు. మంగళవారం ఆయన సిఎం చంద్రబాబును కలిసి నియోజకవర్గ అభివృద్ధిపై మాట్లాడారు. వరికపూడిశెల ప్రాజెక్ట్‌ను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి సాగు, తాగునీటి అవసరాలను తీర్చాలని, బుగ్గవాగు నుండి మాచర్లకు పైపులైను ద్వారా మంచి నీటిని సరఫరాకు నిధులు మంజూరు చేయాలని కోరారు. మాచర్లలో మల్టిస్పెషాలటి వైద్యశాలను, ట్రామాకేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామాల్లో ఇంటింటికీ నీటి కుళాయి ఇస్తామని ప్రజలకు ఇచ్చిన హమీని నెరవేర్చేందుకు సహకరించాలని కోరారు.

➡️