ఉపాధి నిధుల అవినీతిపై విచారణ చేయాలి

Dec 29,2023 00:23

ప్రజాశక్తి – భట్టిప్రోలు
మండలంలో గత మూడేళ్లుగా ఉపాధి హామీ పథకం కింద జరిగిన రూ.60లక్షల నిధుల కుంభకోణంపై తిరిగి విచారణ చేపట్టాలని టిడిపి రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా డిమాండ్‌ చేశారు. ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ ఉపాధి హామీ పథకంలో వైసిపి నాయకులు పనులు జరగకుండానే జరిగినట్లు చూపించి రూ.60లక్షల నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. గత నెలలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని అన్నారు. సంబంధిత డ్రామా పీడీకి విచారణ చేపట్టాలని ఆదేశించాలని అన్నారు. కానీ పిడి విచారణ చేపట్టకుండా తప్పుకొని ఎపీడితో విచారణ చేపట్టారని అన్నారు. విచారణ అధికారిగా వచ్చిన సువార్తమ్మ వైసిపి నాయకులకు కనుసన్నల్లో పనిచేసి వారికి అనుకూలమైన వ్యక్తులతో విచారణ చేపించి ఎలాంటి అవినీతి జరగలేదని చూపించి పత్రికల్లో వివరించి వెళ్లారని అన్నారు. విచారణలో వెళ్లడైన అంశాలను ఉన్నతాధికారులకు నివేదించకుండా తానే పత్రికల్లో ప్రటించడం నిబంధనలకు విరుద్దమని అన్నారు. 13పనులకు 5008మంది కూలీలు పని చేయగా కేవలం 50మందిని మాత్రమే విచారణ చేసి ఎక్కడ అవినీతి జరగలేదని చెప్పటం ఏమిటని ప్రశ్నించారు. రెండు డ్రైనేజీ కాలువలు, ఒక ఇరిగేషన్ కాలువలో చేపట్టిన పనులకు సంబంధించిన ఇంజనీర్లను కూడా విచారణ చేయాల్సి ఉండగా ఎందుకు పిలిపించలేదని ప్రశ్నించారు. అయితే సంబంధిత శాఖల అధికారులు తమ కాలువల్లో ఎలాంటి ఉపాధి హామీ పథకం పనులు జరగలేదని చెబుతున్నప్పటికీ వారిని విచారించకుండా వైసిపి నేతలకు వత్తాసు పలుకుతూ విచారణ ముగించటంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమెపై కూడా విచారణ చేయాలని కలెక్టర్‌కు మరోసారి నివేదించనున్నట్లు తెలిపారు. లోపభూయిష్టంగా చేసిన విశారణలో ఎపీడిని కూడా అనుమానించాల్సి వస్తుందని అన్నారు. అవినీతిని తేల్చేవరకు వదిలేదని లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు కుక్కల వెంకటేశ్వరరావు, మాజీ మండల అధ్యక్షులు వై కరుణ శ్రీనివాసరావు, కనపర్తి సుందర్రావు, ఎడ్ల జయసిలరావు, జంగల్ సామ్సన్, లెనిన్, ఆదిన బసవ పున్నయ్య, కంభం సుధీర్, పాల్గొననారు.

➡️