ఐలవరంలో నూతన భవనాలు ప్రారంభం

Jan 12,2024 00:14

ప్రజాశక్తీ -భట్టిప్రోలు
మండలంలోని ఐలవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయం1, ఆరోగ్య భవనాన్ని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ మేరుగ నాగార్జున, బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ దేవినేని మల్లికార్జునరావు, వైసిపి ఇన్చార్జి వరికూటి అశోక్ బాబు గురువారం ప్రారంభించారు. సభకు సర్పంచ్ మాచర్ల కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. సభలో ఎంపి రమణారావు మాట్లాడుతూ ఐలవరం గ్రామానికి వైసీపీ పాలనలో ఎంతో అభివృద్ధి జరిగిందని అన్నారు. సంక్షేమ పాలనతో పాటు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు పాలన చేరువ చేసే విధంగా నూతన భవనాలను మంజూరు చేసిందని అన్నారు. వీటిని పూర్తిస్థాయిలో ఐలవరం వినియోగించుకుందని అన్నారు. ఈపాటికే సచివాలయం2 భవనం గత ఏడాది పూర్తి చేసుకునే ప్రారంభించి కార్యకలాపాలు కొనసాగిస్తుండగా మరో సచివాలయ భవనం, వెల్నెస్ సెంటర్ ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని అన్నారు. రైతు భరోసా కేంద్రం పూర్తిచేసి రైతులకు చేరువ చెయ్యాలని సూచించారు. మంత్రి డాక్టర్ మెరుగు నాగార్జున మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుండి ఐలవరం ప్రజలు తన వెంట ఉండి తనను ముందుకు నడిపించారని అన్నారు. వారికి తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. తాను ఓడిన, గెలిచిన మైలవరం ప్రజలను మరువలేనని అన్నారు. ప్రభుత్వ భవనాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయని అన్నారు. ఎన్నడూ లేని విధంగా జగన్మోహన్‌రెడ్డి పాలనలో గ్రామంలో మరింత అభివృద్ధి జరిగిందన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా విభేదాలు పక్కనపెట్టి గెలుపుకు కృషి చేయాలని అన్నారు. వైసిపి ఇన్చార్జి వరికుట్టి అశోక్ బాబుకు ప్రజలంతా అండగా ఉండి గెలుపుకు కృషి చేయాలని సూచించారు. అశోక్‌ బాబు గెలుపొందే అవకాశాలు పూర్తిగా ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ డివి లలిత కుమారి, జడ్పిటిసి టి ఉదయ్ భాస్కరి, మండల ఉపాధ్యక్షులు కె పిచ్చయ్య శాస్త్రి, ఎంపిటిసి మురుగుడు శ్రీనివాసరావు, నాయకులు బాలాజీ, మల్లేశ్వరరావు, హేమ సుందదరావు పాల్గొన్నారు.

➡️