ప్రజా పరిచయ వేదికకు ముస్తాబైన క్రిస్టియన్ భవన్

Jan 13,2024 00:58

ప్రజాశక్తి – బాపట్ల
బాపట్ల పార్లమెంటు స్థానం నుండి టిడిపి ద్వారా ప్రజాసేవ చేసేందుకు రాజకీయ ప్రవేశం చేస్తున్న దగ్గుమళ్ళ ప్రసాదరావు పరిచయ వేదికకు స్థానిక క్రిస్టియన్ భవన్ ముస్తాబు చేశారు. బాపట్ల, చీరాల, రేపల్లె, వేమూరు, పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గాల నుండి ప్రజా పరిచయ వేదికకు హాజరయ్యే అతిధులు, నాయకులు, కార్యకర్తల కోసం క్రిస్టియన్ భవన్‌ను సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టిడిపి బాపట్ల పార్లమెంటు ఎస్సీ సెల్ నాయకులు దేవతోటి సుందరయ్య మాట్లాడుతూ టిడిపి ద్వారా బాపట్ల పార్లమెంటు స్థానం నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో అభ్యర్థిత్వాన్ని అధిష్టానం అంగీకారం తెలిపినట్లు తెలిపారు. బాపట్లకు చెందిన దగ్గుమళ్ళ ప్రసాదరావు తల్లి, దండ్రులు పిట్టలవానిపాలెం మండలం ఖాజీపాలెంలో ఉన్నారు. చింతగుంపలలో స్థిరపడిన ప్రసాదరావు ఇండియన్‌ రెవెన్యూ సర్వీసులో వివిధ ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తూ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. సమావేశంలో రాధేయ్ కన్ స్ర్టక్షన్ అధినేత దగ్గుమళ్ళ రాధేయ్, విశ్రాంత సీఈఒ జంగం రాజశేఖర్, టిడిపి నాయకులు పల్లం జీవన్ పాల్గొన్నారు.

➡️