విద్యార్థికి రోటరీ చేయూత

Jan 19,2024 23:53

ప్రజాశక్తి – వేటపాలెం
చదువు మీద ఆసక్తి ఉన్న పేదరికం కారణంతో ఫీజుకట్టలేని విద్యార్థినికి రోటరీ క్లబ్ ఆర్థిక సహాయం అందించింది. వేటపాలెం చేనేతపురి కాలనీ చెందిన అందె దీపిక ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతుంది. ఫీజు కట్టలేని పరిస్థితుల్లో రోటరీ క్లబ్ రూ.7వేల ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు బట్ట మోహనరావు, కార్యదర్శి ఎవి సురేష్, ఉపాధ్యాయులు పింజల శ్రీనివాసరావు, సంఘ సేవకురాలు కొసనం నాగమాంబ, ఐసిడిఎస్ సూపర్వైజర్ సజ్జ పుష్పవల్లి, వడగ రాజా, నన్నపనేని సునీల్ కుమార్ పాల్గొన్నారు.

➡️