ఘనంగా పోషణ పక్వాడా

Mar 12,2024 00:02

ప్రజాశక్తి – వేటపాలెం
మండలంలోని దేశాయిపేట ఐసిడిఎస్‌ సెక్టార్‌లోని జీవరక్ష నగర్‌ అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీడీపీఓ సుచిత్ర మాట్లాడుతూ పోషక ఆహారం తీసుకుని మహిళలు ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని అన్నారు. అందులో బాగంగా తల్లులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. రాగి, జొన్న, సజ్జ పిండులతో దోశలు, బూరెలు, రొట్టెలు తయారుచేసే విధానాన్ని చేసి చూపించారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. పోషకాహారం ప్రాధాన్యతపై ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో సూపర్వైజర్ ఎస్ లీలావతి, అంగన్‌వాడీ కార్యకర్తలు ఎన్ పూర్ణిమ, ఎం పద్మ, బి వరలక్ష్మి, టి లక్ష్మి సుజాత, డి శారద, జి నాగ లక్ష్మీ పాల్గొన్నారు. వేటపాలెం సెక్టర్లోని చేగుడు మాలపల్లిలోని అంగనవాడి కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో సూపర్వైజర్ సజ్జ పుష్పవల్లి, అంగన్‌వాడీ కార్యకర్తలు శిరీష, ప్రసన్న, రత్న కుమారి, జ్యోతి, కాశమ్మ, కృష్ణ, తులసి పాల్గొన్నారు.

➡️