చిట్టి చేతుల గట్టి ప్రయత్నం

Nov 29,2023 23:33

ప్రజాశక్తి – ఇంకొల్లు రూరల్‌, పర్చూరు
చిన్నారి చిట్టి చేతులు గట్టి ప్రయత్నం చేశారు. ఇంకొల్లు ఆదర్శ విద్యా సంస్థల విద్యార్థులు నూతలపాడులోని ఆశ్రయ వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. చాలా కాలంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వృద్దాశ్రమంలో నిరు పేదలకు గుప్పెడు బియ్యం కార్యక్రమంలో భాగంగా ఆశ్రమానికి 100కేజీల బియ్యాన్ని అందజేశారు. ఈసందర్భంగా విద్యార్థినులు ఎంతో చక్కగా వృద్ధులతో మమేకమై వాళ్ళతో సంభాషించారు. చిన్నారులు చేసిన ప్రయత్నానికి ఆశ్రయ వృద్ధాశ్రమ నిర్వాహకులు, వృద్దులు ధన్యవాదాలు తెలిపారు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన ఆదర్శ విద్యా సంస్థల డైరెక్టర్ విజయభాస్కర్‌ను ఆశ్రమ నిర్వాహకులు భవనం శ్రీనివాసరెడ్డి, జయలక్ష్మి దంపతులు అభినందించారు.

➡️