పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ప్రజాశక్తి – బాపట్ల
పట్టణంలోని ఎవివి హైస్కూలు 1998-99 బ్యాచ్ 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. పాతికేళ్ల నాటి విద్యార్థులు పాఠశాల్లో కలుసుకొని ఆనాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయంలో స్థిరపడిన ఆనాటి పదో తరగతి విద్యార్థులు ఒకరినొకరు పరిచయం చేసుకొని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. వారు చేస్తున్న వృత్తి, ఉద్యోగాలు తెలుసుకొని, వారికి పాఠాలు నేర్పిన గురువులను సత్కరించి, వారిపట్ల గౌరవాన్ని చాటుకున్నారు. చదువుకున్న పాఠశాలకు మరమత్తులు, ఇతర అభివృద్ధి పనులకు తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు.

➡️