శాంతి భద్రతలకు విఘతం కలిగిస్తే చర్యలు

May 22,2024 23:59 ##Bapatla #Chirala #Police

ప్రజాశక్తి – చీరాల
ఓట్ల లెక్కింపు సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని 2వ పట్టణ సీఐ సోమశేఖర్ హెచ్చరించారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు డిఎస్పీ బేతపూడి ప్రసాద్ ఉత్తర్వులతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతల్లో భాగంగా పట్టణంలోని శృంగారపేటలో బుధవారం కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. శృంగారపేట పరిసరాల్లో ప్రతి ఇంటిని సోదా చేశారు. ఇంటి ఆవరణలో పెట్రోల్, డిజిల్, కర్రలు, రాళ్ళు వంటివి ఏమైనా ఉన్నాయా అనే అంశంపై తనిఖీలు చేశారు. రౌడీ షీటర్స్‌కు వారి ఇంటి వద్దనే కౌన్సిలింగ్ ఇచ్చారు. ఓట్ల లెక్కింపు ముందు, తర్వాత ఎటువంటి ఘర్షణలు, వివాదాలకు వెళ్లవద్దని హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి సమాచారం తమకు తెలియజేయాలని కోరారు. అనంతరం ఆయా ప్రాంతాల్లోని వాహనాలు తనిఖీ చేశారు. పోలీసు ఉత్తర్వులను అతిక్రమిస్తే కేసులు నమోదు చేయడమే కాకుండా రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు.

➡️