ఆంద్రోధ్యమానికి పురుడు పోసిన బాపట్ల

May 26,2024 22:35 ##Bapatla #Jurnalist

ప్రజాశక్తి – బాపట్ల
ఆంధ్రోద్యమం బాపట్లలోనే పురుడు పోసుకుందని బాపట్ల ఆహార విజ్ఞాన కళాశాల అసోసియేట్ డీన్ ఆచార్య ఎల్ ఏడుకొండలు అన్నారు. ప్రథమాంధ్ర మహాసభ 111వ వార్షికోత్సవం సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ ఆధ్వర్యంలో టౌన్ హాల్ ప్రాంగణంలో శతాబ్ది స్తూపం, తెలుగు తల్లి విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రుల స్వరాష్ట్ర వాంఛకు ఇక్కడే బీజం పడిందని అన్నారు. 1913లో బాపట్లలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభ నాలుగు దశాబ్దాల ఆంధ్రోద్యమానికి నాంది పలికిందని అన్నారు. తెలుగువారి ఐక్యతకు ఊతమిచ్చిన చరిత్ర బాపట్లకు ఉందన్నారు. బాపట్లలో జరిగిన మహాసభలు భాషా ప్రయుక్త రాష్ట్ర వాదనకు శ్రీకారం చుట్టాయన్నారు. అంధ్ర విశ్వవిద్యాలయ స్థాపనకు కూడా ఇక్కడే బీజం పడిందన్నారు. తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. మా తెలుగు తల్లి’గేయాన్ని ఆలపించారు. కార్యక్రమంలో ఫోరం కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు, గంటసాల చైతన్య వేదిక నాయకులు కోట వేంకటేశ్వరరెడ్డి, విశ్రాంత ఆచార్యులు కె విజయ కుమార్, జి శాంతరామ్, లక్కాకుల వెంకట్రావు, పౌర సమాఖ్య నాయకులు రమణ కుమార్, జివి, కాగిత కోటేశ్వరరావు, గుదే రాజారావు, వంకాయలపాటి హరిబాబు, మురళి, కరణం రవీంద్ర పాల్గొన్నారు.

➡️