మునగపాటి ఆధ్వర్యంలో అన్నదానం

Jan 19,2024 00:21

ప్రజాశక్తి – వేటపాలెం
చంద్రబాబును సిఎం చేసుకుంటేనే మళ్లీ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని టిడిపి సీనియర్ నాయకులు మునగపాటి వెంకటేశ్వరరావు అన్నారు. మండలంలోని నూలుమిల్లు సెంటర్ నందు ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా రెండు వేల మందికి అన్నదానం చేశారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రానున్న ఎన్నికల్లో తాను టిడిపి తరఫున బరిలో దిగుతున్నట్లు చెప్పారు. ప్రజలు తనను ఆశీర్వదిస్తే శక్తి వంచన లేకుండా అభివృద్ధికి పాటుపడతారని చెప్పారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు సజ్జ వెంకటేశ్వరరావు, డాక్టర్‌ సజ్జ హేమలత పాల్గొన్నారు.

➡️