టిడిపిలో బిసిలకు సముచిత స్థానం

Mar 31,2024 23:53 ##tdp #Battiprolu #Anandababu

ప్రజాశక్తి – భట్టిప్రోలు
టిడిపిలోనే బిసిలకు సముచిత స్థానం లభిస్తుందని టిడిపి బీసీ సెల్ వేమూరు నియోజకవర్గ అధ్యక్షులు బట్టు మల్లికార్జునరావు అన్నారు. స్థానిక టిడిపి కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్న ఎన్టీఆర్ బీసీల అభ్యున్నతికి, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం టిడిపిని స్థాపించారని అన్నారు. కానీ సిఎం జగన్మోహనరెడ్డి అందుకు భిన్నంగా బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. గడచిన ఐదేళ్లలో బీసీలకు కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. కానీ టిడిపి అధినేత చంద్రబాబు బీసీల్లో బాగా వెనుకబడిన వర్గమైన రజకులను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు హామీలు ఇవ్వడం అభినందనీయమని అన్నారు. నియోజకవర్గంలో బీసీల్లో అన్ని వర్గాలు వెనకబడే ఉన్నాయని అన్నారు. టిడిపి అధికారానికి వస్తే గతంలో మాదిరి వృత్తులను బట్టి పథకాలు అమలు చేసేందుకు హామీ ఇచ్చారని అన్నారు. చంద్రన్న బీమా రూ.10లక్షలు వరకు పెంచుతున్నట్లు ప్రకటించారని తెలిపారు. కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ వాక శేషుబాబు, నాయకులు దీపాల ప్రసాద్, మాచర్ల నాగరాజు, అనగాని ఏడుకొండలు, రాయన్న ప్రసాదరావు, వామనపల్లి కోటేశ్వరరావు పాల్గొన్నారు.

➡️