పేదల ఆరోగ్య బరోసాకే ఆరోగ్యశ్రీ

Dec 21,2023 02:16

ప్రజాశక్తి – చీరాల
పేదల ఆరోగ్య పరిస్థితులు, వైద్యఖర్చులను దృష్టిలో పెట్టుకుని సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి డాక్టర్ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5లక్షల నుంచి రూ.25లక్షల వరకు పెంచారని ఎంఎల్‌ఎ కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. స్థానిక 7వ వార్డులో బుధవారం జరిగిన ఆరోగ్యశ్రీ నూతన కార్డుల పంపిణీ సభలో ఆయన మాట్లాడారు. వైద్య చరిత్రలో అతి పెద్ద మైలురాయిగా వైఎస్ఆర్ అర్యోగ శ్రీ నిలుస్తుందని అన్నారు. మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర ప్రధాన నగరాల్లో కార్పొరేట్‌ వైద్యం పొందేందుకు అనువుగా దేశంలో ఎక్కడా లేని విధంగా పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచిత వైద్య సదుపాయాలు అందించిన ఘనత జగన్మోహన్‌రెడ్డిదని అన్నారు.పేద ప్రజలకు ఆరోగ్య రీత్యా ఎటువంటి ఇబ్బంది పడకుండా ఏ హాస్పిటల్‌కు వెళ్లిన ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25లక్షల వరకు ఉచిత వైద్యం పొందవచ్చని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వైద్య సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనిగల జైసన్ బాబు, జిల్లా కార్యదర్శి శిఖా సురేష్, యాతం మేరీబాబు, సునీల్, వైద్యసిబ్బంది సిహెచ్‌ శేషుబాబు, స్థానిక ప్రజలు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్స్, సచివాలయం సిబ్బంది, వాలంటీర్స్ పాల్గొన్నారు.

➡️