అసెంబ్లీ సీటు బీసీలకు కేటాయించాలి

Mar 2,2024 23:18

ప్రజాశక్తి – చీరాల
చీరాల అసెంబ్లీ సీటు ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ బిసిలకు కేటాయించాలని పలువురు బిసి నేతలు కోరారు. స్థానిక అంబేద్కర్ భవనంలో ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, బీసీ సంఘాల నాయకులు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం శనివారం నిర్వహించారు. చీరాల నియోజకవర్గంలో మొదటి నుంచి బీసీలకే సీటు ఇచ్చేవారని అన్నారు. అయితే క్రమేపి బీసీలను పక్కనపెట్టి ఓసీలకు, బయటి నుంచి వచ్చిన వ్యక్తులకు కేటాయించి స్థానికులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. స్వలాభం కోసం పార్టీలు ఓసీలకు అవకాశం ఇస్తున్నాయని అన్నారు. బయట వారికి ఇచ్చినప్పటికీ వారిని గెలిపించిన చీరాల్లో అభివృద్ధి మాత్రం శూన్యంగా మారిందని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు స్థానిక బీసీలకు కేటాయిస్తేనే ప్రజల మద్దతు ఉంటుందని అన్నారు. లేకుంటే ఓడిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర, జూలియన్, దామర్ల శ్రీకృష్ణ, అవ్వారు ముసలయ్య, బాబురావు, ధర్మ, శాస్త్రి, వాసు, గుమ్మడి ఏసురత్నం, షేక్‌ జిలాని పాల్గొన్నారు.

➡️