వాలంటీర్‌పై దాడి హేయమైన చర్య

Jun 18,2024 00:35 ##Vemuru #Ycp #AshokBabu

ప్రజాశక్తి – వేమూరు
మండలంలోని చంపాడు గ్రామానికి చెందిన మాజీ వాలంటీర్ పమిడిపాముల జ్యోతిపై టిడిపి కార్యకర్తలు దాడి చేసి గాయపరచటం హేయమైన చర్యని వైసిపి ఇన్‌ఛార్జి వరికూటి అశోక్ బాబు అన్నారు. జ్యోతి వైసిపికి అనుకూలంగా పనిచేసిందనే నెపంతో టిడిపి కార్యకర్తలు మహిళని కూడా చూడకుండా దాడి చేసి గాయపర్చడం టిడిపి అరాచకాలకు అద్దం పడుతుందని అన్నారు. దాడి సమాచారం తెలుసుకున్న ఆయన వైద్యశాల్లో ఉన్న జ్యోతిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి తక్షణమే విందుతులపై కేసు నమోదు చేయాలని పిర్యాదు చేయించారు. గాయపడిన ఆమెకు వైసిపి అండగా ఉంటుందని చెప్పారు. ఎన్నికల్లో ప్రజలు టిడిపికి పూర్తి మద్దతుని ఇచ్చారని, గెలుపొంది ప్రజలకు అన్ని విధాలుగా సేవ చేయాలి తప్ప కక్ష సాధింపు చర్యగా దాడులకు పాల్పడటం సరికాదన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు సైతం దాడులకు భయపడాల్సిన పనిలేదని అన్నారు. తాను నియోజకవర్గంలోనే కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వైసిపి నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి జైళ్ళకు పంపించాలని చూస్తే సహించేది లేదని అన్నారు. ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. వైసిపి ఓడిపోయింది తప్ప చచ్చిపోలేదనే విషయాన్ని గుర్తించు కోవాలని సూచించారు.

➡️