గ్రామీణ బంద్‌కు మద్దతుగా ఆటో కార్మికుల ధర్నా

Feb 17,2024 00:26

ప్రజాశక్తి – బాపట్ల
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైతు, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా చేపట్టిన గ్రామీణ బంధుకు మద్దతుగా సిఐటియు ఆధ్వర్యంలో పట్టణంలో ఆటో కార్మికులు శుక్రవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ మజుందార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రవాణా రంగం కార్మికులను ఇబ్బందులకు గురిచేసే 106(1), (2) క్లాజ్‌తో తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేయాలని అన్నారు. ఆకస్మికంగా జరిగే ప్రమాదాల్లో డ్రైవర్లను నేరస్తులను చేసేవిధంగా చట్టం ఉందని అన్నారు. ఈ చట్టం ప్రకారం గరిష్టంగా పదేళ్ళు జైలు శిక్ష, రూ.10లక్షలు జరిమానా విధించడం సరికాదన్నారు. ఈ చట్టం డ్రైవర్లకు ఉరి తాడు లాంటిదన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు కె శరత్, జి శామ్యూల్, ఆటో యూనియన్ నాయకులు బి బుచ్చిరాజు, నాగరాజు, బ్రహ్మం, గోపి పాల్గొన్నారు.

➡️