ఓటు హక్కు వినియోగంపై అవగాహన

Mar 30,2024 23:32 ##Repalle #RDO #Voter

ప్రజాశక్తి – నగరం
మండల కేంద్రం నగరం ప్రధాన కూడలిలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన సదస్సు శనివారం నిర్వహించారు. సదస్సులో రేపల్లె ఆర్‌డిఒ హెలా షారోన్ మాట్లాడారు. ప్రతిఒక్కరు ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని గ్రామస్తులకు సూచించారు. ఓటు ఆయుధంగా ఉపయోగించి మంచి నాయకులను ఎంచుకోవాలని అన్నారు. వైకల్యం ఉన్నవారికి, 85ఏళ్లు దాటిన వృద్దులకు ఎన్నికల కమిషన్ కొత్తగా ఇంటివద్దనే ఓటుక్కు వినియోగించుకునే సౌలభ్యం కల్పించారని తెలిపారు. బూతుకు వచ్చే వికలాంగుల సౌకర్యార్థం వాహనాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీల్ చైర్లు అందుబాటులో ఉంటాయని అన్నారు. వాటి కోసం రాంప్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతిఒక్కరు తప్పనిసరిగా బూత్ వద్దకు వచ్చి ఓటుహక్కు వినియోగించు కోవాలని అన్నారు. అనంతరం ప్రజలచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో తహశీల్ధారు శ్రీశిల్ప, ఎంపీడీఒ చక్రవాణి ప్రసాద్, డిప్యూటీ తహశీల్దారు మస్తానరావు పాల్గొన్నారు.

➡️