బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ

Feb 17,2024 00:11

ప్రజాశక్తి – చెరుకుపల్లి
బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారెంటీ పధకాలను టిడిపి నాయకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. టిడిపి, జనసేన మినీ మేనిఫెస్టో, సూపర్‌ సిక్స్‌ పధకాలను వివరిస్తున్నారు. మండలంలోని కావూరు, నడింపల్లి గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు పుషడపు కుమారస్వామి, దివి రాంబాబు, గోగినేని వసుధ, కావూరు సర్పంచ్ చెల్లి జ్యోతి రవికుమార్, తాతాజీ, చుక్క కోటయ్య, మారిశెట్టి వెంకట వరప్రసాద్ పాల్గొన్నారు.

➡️