అక్రమంగా తరలిస్తున్న ఇసుక : పోలీసులకు బిఎస్పీ నాయకుల ఫిర్యాదు

May 22,2024 23:53 ##sand #Bapatla

ప్రజాశక్తి – బాపట్ల
మండలంలోని కప్పలవారిపాలెం వద్ద నల్లమడ వాగు ఎడమవైపు కట్టను తవ్వి అక్రమంగా ఇసుక తరలిస్తున్నప్పటికీ పట్టించుకోని డ్రైనేజీ అధికారులపై చర్యలు తీసుకోవాలని బిఎస్‌పి నాయకులు గ్రామీణ సీఐ శ్రీహరికి బుధవారం ఫిర్యాదు చేశారు. అక్రమ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని బిఎస్‌పి నాయకులు కాగిత కోటేశ్వరరావు, గుదే రాజారావు కోరారు. కాగిత కోటేశ్వరరావు మాట్లాడుతూ సుమారుగా 2వందల ట్రాక్టర్ల ఇసుక అక్రమంగా తరలిస్తున్నప్పటికీ డ్రైనేజీ అధికారులకు తెలిసి కూడా పట్టించుకోవడం లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రధానంగా డ్రైనేజీ ఎఈ భరద్వాజకు తెలిసినప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. వరదలు సంభవిస్తే కట్టలు తెంచుకొని ఊళ్ళు, పొలాలు మునిగిపోయే ప్రమాదం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. నల్లమడ వాగు కట్ట ఇసుక తరలింపుతో పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించాలని కోరారు. ఇసుక అక్రమాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎఈ భరద్వాజపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.

➡️