బీహెచ్ఈఎల్‌కు బస్సు ప్రారంభం

Jan 12,2024 00:01

ప్రజాశక్తి – ఇంకొల్లు రూరల్‌
ఒంగోలు డిపో నుండి బీహెచ్ఈఎల్‌కు సూపర్ లగ్జరీ బస్సు నడపాలని ఒంగోలు రీజనల్ మేనేజరు సుధాకర్ ఒంగోలు డిపో మేనేజర్ శ్రీనివాసరావును నెల్లూరు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆదామ్ సాహెబ్ ఆదేశించారు. గతంలో ఒంగోలు నుండి నాగులుప్పలపాడు, రాచపూడి, దుద్దుకూరు, ఇంకొల్లు, పర్చూరు, చిలకలూరిపేట మీదగా నడిచే ఈ సర్వీసులు కిలోమీటర్ల ఒప్పందంలో ఆగిపోవడంతో సమస్యపై అధికారుల దృష్టికి పలువురు ప్రయాణికులు తీసుకెళ్లారు. ఒంగోలులో రాత్రి 8గంటలకు బయలుదేరి ఇంకొల్లుకు 9గంటలకు చేరుతుంది. ఇంకొల్లు నుండి బయలుదేరి పర్చూరు, చిలకలూరిపేట, నరసరావుపేట మీదగా బీహెచ్ఈఎల్‌కు చేరుతుంది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, రిజర్వేషన్ సౌకర్యం ఉన్నట్లు తెలిపారు. బస్సు ఏర్పాటు చేయటం పట్ల ఇంకొల్లు మండల ప్రయాణికుల సంఘం అధ్యక్షులు అన్నంభొట్ల మోహన్ కృష్ణ శాస్త్రి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

➡️