వైసిపి అభ్యర్ధి బాలాజీ కోసం ప్రచారం

Apr 11,2024 01:04 ##YCP #Balaji

ప్రజాశక్తి – పర్చూరు
సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైసిపి ఎంఎల్‌ఎ అభ్యర్ధి యడం బాలాజీ గెలుపుల కోసం వైసిపి నాయకులు బుధవారం ప్రచారం చేశారు. స్థానిక ఇందిరా కాలనీలో గడప గడపకు వెళ్లి సిఎం వైఎస్‌ జగన్‌ అమలు చేసిన సంక్షేమ పధకాలు వివరించారు. సంక్షేమం మళ్ళీ కొనసాగాలంటే వైసిపి అభ్యర్ధులు యడం బాలాజీ, బాపట్ల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్‌కు ఓటు వేయాలని కోరారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు.

➡️