తిరుమలకు రాజధాని రైతుల పాదయాత్ర

Jun 16,2024 23:26 ##Inkollu #Rajadhani #Ruthu

ప్రజాశక్తి – ఇంకొల్లు
తెలుగుదేశం అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి అమరావతిని రాజధానిగా నిర్మాణ పనులు వెంటనే చేపట్టినందుకు రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెం గ్రామానికి చెందిన రైతులు పలువురు తిరుమలకు కాలినడకన బయలుదేరారు. అందులో భాగంగా కాలినడకన వెళుతున్న రైతులు ఆదివారం సాయంత్రం ఇంకొల్లు చేరుకున్నారు. ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ గత ఐదేళ్లుగా జగన్ ముఖ్యమంత్రిగా ఉండి అమరావతి రాజధానిని నాశనం చేసి మహిళలను అగౌరపరిచి విధ్వంసం సృష్టించారాని అన్నారు. అప్పటి నుంచి తాము రాష్ట్రానికి అమరావతి రాజధాని కావాలంటూ నిరాటంకంగా నిరసన కార్యక్రమాలు, దీక్షలు చేపట్టి పాదయాత్ర కూడా రాష్ట్రమంతా చేశామని అన్నారు. దేవుడు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కరుణించి విధ్వంసపు జగన్‌కు బుద్ధి చెప్పి ఎన్డీఎ కూటమికి ఊహించని అఖండ మెజార్టీ ఇచ్చారని అన్నారు. ఇప్పుడు మళ్లీ అమరావతి రాజధానిగా మారేందుకు చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించడంతో తమ మొక్కులు తీర్చు కునేందుకు వెంకటపాలెం నుంచి తిరుమలకు కాలినడకన బలిదేరినట్లు తెలిపారు. కాలినడకన బయలుదేరిన వారిలో జోనలగడ్డ భాస్కరరావు, దువ్వాడ వెంకటేశ్వర్లు, అబ్బూరి శ్రీనివాసబాబు, చెరెడ్డి జనార్దనరావు, ఆలపాటి బాలచంద్రుడు, ముప్పవరపు వెంకటేశ్వర్లు, తల్లారి శేఖర్, నల్లజల విశ్వేశ్వరరావు, అంబటి శివ, పోలిశెట్టి రమణ, ఉంగుటూరు శివ, శివశంకరరావు పాల్గొన్నారు.

➡️