డయేరియా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

ప్రజాశక్తి – రేపల్లె

డయేరియా అవగాహన ర్యాలీని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ పట్టణంలోని 13వ వార్డులో జెండా ఊపి సోమవారం ప్రారంభించారు. రాజ్యలక్ష్మి థియేటర్, మున్సిపల్ ఆఫీస్ మీదుగా రైల్వే స్టేషన్, తాలూకా సెంటర్ వరకు ర్యాలి నిర్వహించారు. చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని, పరిసరాలు పరిశుబ్రంగా ఉంచుకోవాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్‌ రమేష్ సముద్రాల, డాక్టర్‌ జాన్ ప్రసాద్, డాక్టర్‌ అబ్దుల్ రెహ్మాన్, అంగన్‌వాడి సిడిపిఓ మాణిక్యమ్మ, సిఎంఎం విజయ కుమారి, హెల్త్ విజిటర్లు పద్మావతి, బుల్లెమ్మ, సూపర్వైజర్ శ్రీలక్ష్మి, మెప్మా సీఓలు, ఎఎన్ఎంలు పాల్గొన్నారు. ఎంపీడీఒ శ్రీనివాసులురెడ్డి నల్లురిపాలెంలో స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ప్రారంభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ గొరికపూడి నాంచారమ్మ పాల్గొన్నారు.


అద్దంకి : పట్టణంలో మోదేపల్లి, కాకానిపాలెం, గాజులపాలెం, అద్దంకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది అతిసార వ్యాధి నిర్మూలనపై డాక్టర్‌ మనోజ్, జయసింహ, శ్రీ హర్ష, మాధురి సిబ్బందితో కలిసి సోమవారం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ ఎ నాగేశ్వరరావు, సూపర్వైజర్ సత్తార్, వెంకాయమ్మ, తబిత, జానీ పాల్గొన్నారు.


భట్టిప్రోలు : ప్రజలు అతిసార వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలని పిహెచ్‌సి డాక్టర్‌ డిఎల్ పద్మజ, సిహెచ్ రామలక్ష్మీ సూచించారు. గ్రామంలో ర్యాలి నిర్వహించారు. తాగునీరు, పరిసరాల పరిశుబ్రతపై అవగాహన కల్పించారు.


పర్చూరు : డయేరియాపై అవగాహన కలిగించాలని శాసన సభ్యులు ఏలూరి సాంబశివరావు అన్నారు. డయేరియా అవగాహన ర్యాలిని ఆయన ప్రారంభించారు.

➡️