చెంచుకాలనీలో కార్టన్‌ అండ్‌ సెర్చ్‌

May 26,2024 22:28 ##parchuru #ero #election

ప్రజాశక్తి – పర్చూరు
కక్షలు, కార్పన్యాలతో జీవితాన్ని బలి చేసుకోవద్దని సిఐ సిహెచ్ సీతారామయ్య పేర్కొన్నారు. ఎస్‌పి వకుల్‌ జిందాల్‌ ఆదేశాల మేరకు స్థానిక చెంచుల కాలనీలో కార్టన్‌ అండ్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఓట్లు లెక్కింపు సందర్భంగా ఎలాంటి వివాదాలకు పాల్పడవద్దన్నారు. చట్టాలను అతిక్ర మించి శాంతి భద్రతలకు విఘాతం కలుగ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. క్షణికా వేశాలకు గురై జీవితాలు పాడు చేసుకోవద్దని సూచించారు. దుర్యసనాలకు లోను కాకుండా ఆదర్శవంతంగా జీవితాన్ని గడపాలని కోరారు. ఆయన వెంట ఎస్‌ఐ ఆర్ రమేష్, ఎఎస్ఐ కోటేశ్వరరావు పాల్గొన్నారు.


యద్దనపూడి : మండలంలోని అనంతవరంలో ఆదివారం రాత్రి ఎస్‌ఐ జివి చౌదరి ఆధ్వర్యంలో కార్టన్ అండ్‌ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఒక్కరు నియమ నిబంధనలకు అనుగుణంగా నడచు కోవాలని చెప్పారు. కార్యక్రమంలో ఎఎస్ఐ శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు, సిబ్బంది శివ కృష్ణ, నాగరాజు, వెంకయ్య పాల్గొన్నారు.

➡️