ప్రోత్సహించేందుకే నగదు బహుమతి

Mar 2,2024 23:19

ప్రజాశక్తి – చీరాల
విద్యార్థులు బాగా చదివి ఉత్తమ ప్రతిభ కనబర్చి ఘంటా విజ్ఞాన నగదు ప్రోత్సాహం అందుకోవాలని పద్మ భాస్కర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఘంటా అనిల్ కుమార్ అన్నారు. కారంచేడు మండలంలో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మొదటి, 2వ, 3వ స్థానం విద్యార్థులకు ఘంటా విజ్ఞాన నగదు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు తెలిపారు. విద్య ద్వారానే ఉన్నత స్థానాలకు చేరుతారని అన్నారు. తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుల, మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు అన్నారు. పర్చూరుకు చెందిన జిజికె టుబాకో కంపెనీ అధినేత ఘంటా గోపాల కృష్ణయ్య చౌదరి మనుమడు ఘంటా అశోక్ బాబు జ్ఞాపకార్థం ఈ విద్య సంవత్సరంలో కారంచేడు మండలంలోని ప్రభుత్వ పాఠశాల్లో చదివే 10వ తరగతి విద్యార్థులకు ఘంటా విజ్ఞానం నగదు ప్రోత్సాహం అందిస్తున్నామని అన్నారు. విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

➡️