చలో విజయవాడకు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు

Dec 10,2023 23:25

ప్రజాశక్తి – చీరాల
విజయవాడలో చేపట్టిన మునిసిపల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మహాసభను జయప్రదం చేసేందుకు చీరాల జెఏసి నాయకులు ఆధ్వర్యంలో బస్సులో చలో విజయవాడకు ఆదివారం తరలి వెళ్లారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి ఉద్యోగులందరూ తమ సమస్యల పరిష్కారం కోసం జేఏసీ పిలుపు మేరకు తరలి వెళ్లారు. రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మొదటి సభ కావడంతో ఉద్యోగులు పూర్తిస్థాయిలో తరలి వెళ్లారు. స్థానిక జేఏసీ అధ్యక్షులు, నాన్ గజిటెడ్‌ ఎంప్లాయిస్ అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, స్థానిక నాయకుల, ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ పాల్గొన్నారు.

➡️