హామీలకు కట్టుబడి పనిచేసే వ్యక్తి చంద్రబాబు

Jun 15,2024 00:10 ##Battiprolu #Tdpnews #Apnews

ప్రజాశక్తి – భట్టిప్రోలు
రాష్ట్రంలో గాడి తప్పిన పాలనను ముందుకు తీసుకువెళ్లి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కట్టుబడి ఉన్నారని టిడిపి రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా అన్నారు. స్థానిక టిడిపి కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు ముందుగా ఐదు అంశాలపై సంతకాలు చేయటం అభినందనీయం అన్నారు. నిరుద్యోగులకు బరోసా కల్పించే విధంగా మెగా డిఎస్సి, రైతుల ఆస్తులకు రక్షణ కల్పిస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేయడం, అవ్వ, తాతల పెన్షన్‌ రూ.4వేలకు పెంచటం, పేదవారికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్‌లను పునరుద్దరించడం, నైపుణ్య గణనపై సంతకం చేయడం సుపరిపాలను శ్రీకారం చుట్టడమేనని అన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టటంతోనే రాష్ట్రంలో కంపెనీలు, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని అన్నారు. ఇప్పటికే కొన్ని సంస్థలు రంగంలోకి దిగినట్లు పేర్కొన్నారు. స్థానికంగా వివిధ శాఖల్లో జరిగిన అవినీతి అక్రమాలపై త్వరలో ప్రభుత్వ ఉన్నతాధికారుల ద్వారా విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. చంద్రబాబు ఆధీనంలో రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

➡️