పార్టీలు మారడం సహజం : బొర్రా శ్రీనివాసరావు

Dec 24,2023 00:01

ప్రజాశక్తి -రేపల్లె
అధిష్టానం ఎంపిక చేసిన నూతన ఇన్‌ఛార్జితో పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందని వైసీపీ నాయకులు, న్యాయవాది బొర్రా శ్రీనివాసరావు ఆరోపించారు. ఆయన శనివారం విలేకర్లతో మాట్లాడారు. రేపల్లె సీటు విషయంలో అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలపట్ల పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. పార్టీని నష్టపెట్టే ముంచే విధంగా ఎవ్వరు వ్యవహరించిన నమ్మక ద్రోహం చేసినట్లేనని చెప్పారు. వైసిపిని రాష్ట్రం నుండి పారదోలుతామని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలు మారటం సర్వసాధారణం అన్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీని ప్రజలు తరిమికొడతారని చెప్పారు. సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు అందజేసిన సంక్షేమ పథకాలు దేశంలోనే ఎవ్వరూ అమలు చేయలేదని అన్నారు. వైసిపి శ్రేణులు సమిష్టిగా గెలుపుకు పనిచేయాలని కోరారు. నూతన ఇన్‌ఛార్జి విషయంలో పున పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.

➡️