దైవ దర్శనానికి వచ్చి అనంత లోకాలకు

May 25,2024 23:58 ##Chirala #accident

ప్రజాశక్తి – చీరాల
ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి కారంచేడు- చీరాల రహదారిలో రామానాయుడు వారధి వద్ద జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన బి సాధనరావు (30) గత 3రోజుల క్రితం దైవదర్శనంకు హైదరాబాదు నుండి తిరుపతి వెళ్ళాడు. దర్శనం అనంతరం అక్కడ నుండి శ్రీశైలం వెళ్ళాడు. అనంతరం తిరిగి హైదరాబాదు వెళ్లేందుకు చీరాల నుండి కారంచేడు మార్గంలో ప్రయాణిస్తున్నాడు. అయితే అదే మార్గంలో కారంచేడులో నివాసం ఉంటున్న మర్రిపల్లి ఏడుకొండలు(55) చీరాల వైపుకు ద్విచక్ర వాహనంపై వస్తు ఆ మార్గంలోని రామానాయుడు వారధి వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారంచేడు వాసి ఏడుకొండలు అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాలైన తెలంగాణ వాసి సాధనరావును స్థానికులు చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ సాదనరావు మృతి చెందారు. సమాచారం అందుకున్న కారంచేడు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడు ఏడుకొండలకు భార్య, పిల్లలు ఉన్నారు. సాధనరావు కుటుంబ సభ్యులు సమాచారం తెలుసుకొని హైదరాబాద్ నుండి చీరాలకు బయలుదేరారు.

➡️