నష్టపోయిన నష్టపరిహారం చెల్లించాలి : సిపిఎం

Dec 7,2023 00:04

ప్రజాశక్తి – అద్దంకి
తుఫాను ప్రభావంతో మండలంలో అధిక వర్షపాతం నమోదు అయింది. తీవ్రమైన ఈదర గాలులు తాకిడికి సింగరకొండపాలెం ఎస్టీ కాలనీలో నివాసం ఉంటున్న కొంతమంది తమ ఇళ్ళను కోల్పోవడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ఇళ్ళు పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. సిపిఎం బృందం కాలనీవాసులు కలిసి అక్కడ విషయాలను పరిశీలించారు. సిపిఎం కార్యదర్శిగా తంగిరాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ఇల్లు కోల్పోయిన పేదలకు నష్టపరహారం చెల్లించాలని కోరారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు కూడా ఆదుకోవాలని అన్నారు. ఎంతోకాలంగా ఇక్కడ జీవిస్తున్న పేదలకు పట్టాలు కూడా లేవని తెలిపారు. వర్షంలో గుడిసెల్లోనే ఉన్నామని మధ్యాహ్నం తర్వాత అధికారులు వచ్చి పునరాస కేంద్రానికి తరలించారని తెలిపారు. పట్టాలు లేక పూరీ గుడిసెలు వేసుకొని ఇక్కడే నివాసం ఉంటున్నామని సిపిఎం నేతలకు బాధితులు తెలిపారు. తహశీల్దారు దృష్టికి సమస్య తీసుకెళతాయని తెలిపారు. పేదలకు పది రోజులకు సరిపడా నిత్యవసర వస్తువులు కూడా పంపిణీ చేయాలని కోరారు. తుపాన్ కారణంగా పంటలకు తీరవైన నష్టం వాటిలిందని అన్నారు. పొగకు, మిర్చి, పత్తి ఇతర అనేక పంటలకి పరిహారం చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు కమరగిరి ప్రమీల, కె హనుమంతరావు పాల్గొన్నారు.

➡️