ముగిసిన హేతువాద అధ్యయన తరగతులు

Dec 19,2023 00:32

ప్రజాశక్తి – ఇంకొల్లు రూరల్‌
స్థానిక రాడికల్‌ హ్యూమనిస్ట్‌ సెంటర్‌ ఆవరణలో గత ఐదు రోజులుగా జరుగుతున్న ఉద్యమం ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు సోమవారంతో ముగిశాయి. చివరి రోజు సమావేశానికి డాక్టర్‌ గుమ్మా వీరన్న అధ్యక్షత వహించారు. ఫిజికల్ రియలిజం అనే అంశంపై భారత హేతువాద సంఘ ప్రధాన కార్యదర్శి మేడూరి సత్యనారాయణ మాట్లాడుతూ విశ్వానికి ఆది అంతాలు లేవన్నారు. విశ్వం నియమబద్ధం అన్నారు. విశ్వం నూతన నిర్ణాన్ని పొందినప్పుడల్లా నూతన లక్షణాలను వ్యక్తం చేస్తుందని అన్నారు. పదార్ధం శక్తిగా, శక్తి పదార్ధంగా మారుతుందన్నారు. విశ్వత్వం – పరిణామం -హేతువాదం అంశంపై భారత హేతువాద సంఘం వైస్ ఛైర్మన్ శ్రీనిపట్టతానం (కేరళ) మాట్లాడారు. మేడూరి సత్యనారాయణ రచన నా రచనలు గ్రంథాన్ని భారత హేతువాద సంఘ ట్రెజరర్ షేక్ బాబు ఆవిష్కరించారు. ఉత్సవాల్లో కరి హరిబాబు, నల్లమోతు రాధాకృష్ణ, కాకి రాజశేకర్, పెంట్యాల రాజా, కరణం రవీంద్రబాబు, అబ్రహాం లింకన్, రాజశేఖర్, తూమాటి హరిబాబు, లోహియా, కళ్యాణం చంద్రశేఖర్, జి పర్వతయ్య, రేజేటి వెంకేశ్వర్లు, హసం తార, గోరంట్ల శాంతారామ్, ఆసోది వెంకటేశ్వర రెడ్డి, అహ్మద్ బాషా పాల్గొన్నారు.

➡️