ఎమ్మెల్యే కొండయ్యకు సత్కారం

Jun 16,2024 23:21 ##Chirala #MLAKondaiah

ప్రజాశక్తి – చీరాల
శాసన సభ్యునిగా విజయం సాధించిన ఎంఎం కొండయ్యను తోటవారిపాలెం, బచ్చులవారిపాలెం గ్రామాల మహిళలు, ప్రజలు పూలదండలతో ఘనంగా ఆదివారం సత్కరించారు. ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో ఎమ్మెల్యే కొండయ్య తోటవారిపాలెం పోలేరమ్మ గుడి, బచ్చులవారిపాలెం పోలేరమ్మ గుడిని సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని ప్రజలు ఆయనను కలసి పూలదండలు, శాలువాతో ఘనంగా సత్కరించారు. తన గెలుపుకు సహకరించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నిత్యం ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని అన్నారు. అనంతరం గ్రామ అభివృద్ధిపై ప్రజలతో కొద్దిసేపు చర్చించారు. ఆయన వెంట తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.

➡️