శాంతిభద్రతలకు సహకరించండి

ప్రజాశక్తి – పంగులూరు
రాష్ట్రంలో ఎన్నికల నిబంధనలు ఉన్నందువల్ల ఎన్నికల లెక్కింపు పూర్తి అయ్యేవరకు గ్రామాల్లో శాంతి బధ్రతలను కాపాడటంలో ప్రజలు సహకరించాలని రేణింగవరం ఎస్‌ఐ కెకె తిరుపతిరావు కోరారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామాల్లో పెట్రోల్, డీజిల్ అక్రమ విక్రయాలు నిలిపివేయాలని కోరారు. గ్రామాల్లో ఎలాంటి విద్వేష సంఘటనలు జరగకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గ్రామాల్లో క్రాకర్స్ అమ్మకాలు కూడా నిలిపివేశామని చెప్పారు. అమ్మకాలు జరిపినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అక్రమంగా చెరువుల్లో, కుంటల్లో మట్టి తవ్వకాలు నిలిపివేయలని చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకూడదని, విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

➡️