రూ.1.79కోట్లతో గ్రామంలో అభివృద్ధి

Mar 11,2024 00:03

ప్రజాశక్తి – కారంచేడు
మండంలోని నాముడువారిపాలెం గ్రామంలో గడచిన మూడేళ్లలో రూ.1.79కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్లు సర్పంచి గుమ్మడి సీతామహాలక్ష్మి చెప్పారు. సర్పంచ్‌గా ఎన్నికైన మూడేళ్లు పూర్తయిన సందర్భంగా స్థానిక పంచాయతీ కార్యాలయంలో వార్డు సభ్యులు, ప్రజలతో సమావేశం ఆదివారం నిర్వహించారు. అభివృద్ధి కార్యక్రమాలపై శిలాఫలకాన్ని ఎంపీపీ నీరు కట్టు వాసు బాబు ఆవిష్కరించారు. గడిచిన మూడేళ్లలో గడప గడపకు నిధులు కింద రూ.10లక్షలతో అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. ఎంపీ నిధులు రూ.38లక్షలతో అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. మండల పరిషత్ నిధులు రూ.12లక్షలు, ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ ఉపాధి హామీ పథకం నిధులు రూ.76లక్షలతో అభివృద్ధి పనులు చేశామని అన్నారు. పంచాయతీ నిధులు, పలువురు దాతల ద్వారా రూ.28లక్షలు, దేవాదాయ శాఖ నుండి రూ.5లక్షలతో అభివృద్ధి పనులు నాయుడువారిపాలెంలో నిర్వహించినట్లు తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.11లక్షలతో అభివృద్ధి పనులు జరిగినట్లుగా తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించిన ఎంపీపీ నీరుకట్టు వాసు బాబుకు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, పాలకవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచి సొంత నిధుల నుండి వార్డు సభ్యులకు నూతన వస్త్రాలు బహూకరించారు. కార్యక్రమంలో నాయకులు గుమ్మడి రామ్మోహన్రావు, పంచాయతీ కార్యదర్శి వినయ్ పాల్, మండల ఉపాధ్యక్షులు యార్లగడ్డ సుబ్బారావు, వైసిపి మండల కన్వీనర్ దండా చౌదరి, కో ఆప్షన్స్ సభ్యులు ముల్లానూర్ అహ్మద్, శ్రీకాంత్, యార్లగడ్డ పాపారావు, గోపతోటి బాబురావు, కారుమూడి సుబ్బారెడ్డి, బుల్లబ్బాయి పాల్గొన్నారు.

➡️