పెన్షన్ పెంపుపై దివ్యాంగుల హర్షం

Jun 16,2024 23:28 ##Repalle #Chandrababu

ప్రజాశక్తి – రేపల్లె
దివ్యాంగుల పెన్షన్ రూ.3వేల నుండి రూ.6వేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెంచిన సందర్భంగా అరుణ శ్రీ దివ్యాంగుల సేవా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రెసిడెంట్ టీ మురళీకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యాహ్నం రెండు గంటలకు తాలూకా కార్యాలయం నుండి తెలుగుదేశం కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేనాని కొణిదెల పవన్ కళ్యాణ్, రెవెన్యూ శాఖ మంత్రి అనగానీ సత్యప్రసాద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గం పరిసర ప్రాంత దివ్యాంగులు పాల్గొనాలని కోరారు.

➡️