పారిశుద్య కార్మికులకు దుస్తులు పంపిణీ

Jul 2,2024 00:39 ##Medarametla #Rotary

ప్రజాశక్తి – మెదరమెట్ల
మండలంలోని రావినూతల పారిశుధ్య కార్మికులకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అన్నంగి సుబ్బారావు పుట్టినరోజు సందర్భంగా నూతన వస్త్రాలు బహుకరించి, శాలువాలతో ఘనంగా సత్కరించారు. డాక్టర్స్ డే సందర్బంగా డాక్టర్ హృదయనాద్‌ను సత్కరించారు. కార్యక్రమంలో సర్పంచి విజయవీణ, రోటరీ అధ్యక్షులు చప్పిడి వీరయ్య, సెక్రటరీ చుండూరి మురళి సుధాకరరావు, మలాది శ్రీనివాసరావు, చిన్ని మురళీకృష్ణ, సందిరెడ్డి శ్రీనివాసరావు, డాక్టర్ ఉబ్బా దేవపాలన, షేక్ మొహమ్మద్ రఫీ, పుట్టంరాజు శ్రీరామ చంద్రమూర్తి, అళహరి హరిప్రసాద్, మోపర్తి వెంకటరావు, దామా వెంకటసుబ్బయ్య, యడ్లపల్లి నరసింహారావు పాల్గొన్నారు.

➡️