విద్యార్థులకు హాల్ టికెట్లు పంపిణీ

Mar 12,2024 00:44

ప్రజాశక్తి – చెరుకుపల్లి
విద్యార్థులు ప్రతిభ కనబరిచి ప్రభుత్వ పాఠశాలలకు గుర్తింపు తీసుకురావాలని ఎంఇఒ టి నవీన్ కుమార్, పులి లాజర్ కోరారు. 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో గుల్లపల్లి జెడ్‌పి ఉన్నత పాఠశాల విద్యార్థులకు హాల్ టికెట్లు సోమవారం అందజేశారు. పాఠశాల నుండి 166మంది విద్యార్ధులు పదోతరగతి పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. గణిత ఉపాధ్యాయులు రాంబాబు విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు ఉచితంగా అందజేశారు. ఎంఈఓలు మాట్లాడుతూ పాఠశాల్లో బోధన బాగా మెరుగుపడుతుందని అన్నారు. విద్యార్థులు అందరూ ఉత్తీర్ణులు అయ్యే విధంగా కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మంచాల విజయ్ కిషోర్ బాబు, హెచ్‌ఎం కవిత పాల్గొన్నారు.

➡️